బుక్ అయిన యానిమల్ నటి త్రిప్తి...ఫ్యాన్స్ ఆనందం
on Dec 27, 2023
యానిమల్ సినిమాతో ప్రపంచ సినీ ప్రేక్షకులకి జ్వరాన్ని తెప్పించిన నటి త్రిప్తి డిమ్రి. ఏ ముహూర్తాన ఆమె యమినల్ లో నటించిందో గాని ఇక అప్పటినుంచి ఇండియా మొత్తం త్రిప్తి నామ జపంతో మారుమోగిపోతుంది. ఆ మూవీ లో ఆమె అందాలని చూడటానికి రిపీటెడ్ గా కూడా యానిమల్ మూవీ చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె ని ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది.ఇప్పుడు త్రిప్తి కి సంబంధించిన ఒక వార్త ఆమె అభిమానుల్లో జోష్ ని తెస్తుంది.
త్రిప్తి ఇప్పుడు సోలో హీరోయిన్ గా ఒక కొత్త సినిమాని ఒప్పుకుంది. పైగా అది అలాంటి ఇలాంటి సినిమా కాదు. ఆషీకీ సిరీస్ తో వచ్చిన ఆషీకీ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 లు దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించాయి. ప్యూర్ మ్యూజికల్ లవ్ స్టోరీస్ గా తెరకెక్కిన ఆ రెండు కూడా ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపాయి.ఇప్ప్పుడు ఆ సిరీస్ ని కంటిన్యూ చేస్తు ఆషీకీ 3 రాబోతుంది. ఇందులోనే త్రిప్తి హీరోయిన్ గా చెయ్యబోతుంది. బాలీ వుడ్ దిగ్గజం అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని టి సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.
దీంతో త్రిప్తి అభిమానులు ఇప్పుడు ఫుల్ ఖుషీతో ఉన్నారు. యానిమల్ లో త్రిప్తి కనపడింది కాసేపైనా కూడా తన అందంతో ఎంతగానో అలరించింది. అలాంటిది ఇప్పుడు ఆషికి 3 లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా చేస్తుండటంతో త్రిప్తి అందాలని మరింతగా ఆస్వాదించవచ్చని భావిస్తున్నారు.
Also Read